బనగానపల్లె: ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో టిడిపి అక్రమాలను అడ్డుకోవాలని బనగానపల్లె ఆర్డిఓకు వినతి పత్రం అందించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలో వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడానికి ప్రయత్నం చేస్తోందని, ఈ అక్రమాలను అడ్డుకోవాలని బనగానపల్లె ఆర్డీవో నరేంద్రనాథ్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కాటసాని విజ్ఞప్తి చేశారు. సోమవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం ఇచ్చారు. BLOల జోక్యం లేకుండా మంత్రి ఆదేశంతో టీడీపీ కంప్యూటర్ ఆపరేటర్లు ఓట్లు తొలగింపు, చేర్పులకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.