బనగానపల్లె: బనగానపల్లెలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కలెక్టర్,ఎస్పీ, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్
సీఎం చంద్రబాబు ఈ నెల 9న బనగానపల్లెలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి గణియా, ఎస్పీ సునీల్ షెరాన్, సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేశ్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.హెలిప్యాడ్, సభా ప్రాంగణం, వేదిక, పార్కింగ్, భోజన ఏర్పాట్లను తనిఖీ చేశారు. భారీగా వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.