గతంలో సీజ్ ద షిప్ అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మౌనవహించడంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చలోక్తులు విసిరారు. బుధవారం ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ బాగా ప్రతి సమస్యపై స్పందించారని, కానీ నేడు ఆ ప్రశ్నించే తత్వం ఏమైందని తెలిపారు. బిజెపి సనాతన ధర్మాన్ని మీదకెత్తుకున్న పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం మర్చిపోయారని విమర్శించారు.