బదిలీ అయిన టీచర్స్ ను వెంటనే రిలీవ్ చేయాలి : నెల్లూరులో ఆందోళన
2025 జూన్ లో బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని నెల్లూరు డిఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. పదేళ్ల నుంచి ఒకే స్కూల్లో పని చేస్తూ ఇబ్బందులు పడుతున్నా ఉపాధ్యాయులను డీఈవో పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని గురువారం ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు