అనంతపురం అర్బన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడు నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | Apr 5, 2026
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు గ్రామానికి చెందిన ఎంపలాకు బాల గంగన్న అనే వృద్ధుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆదివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.