బనగానపల్లె: శక్తి యాప్ ను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలి :నందివర్గం ఎస్ఐ భూపాలుడు
బనగానపల్లె మండలం కైప గ్రామంలోని ZPH హైస్కూలులో విద్యార్థినులకు ఎస్ఐ భూపాలుడు అవగాహన కార్యక్రమం కల్పించారు. పోక్సో చట్టంపై బాలికలు అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. బాల్య వివాహాల పట్ల అప్రమత్తత అవసరమని, గ్రామాలలో ఎక్కడైనా బాల్యవివాహాలు జరిగితే తమకు సమాచారం అందించాలని సూచించారు. ట్రాఫిక్ రూల్స్, హెల్మెట్ వాడకం, సైబర్ నేరాల గురించి వివరించారు. ఫోన్లలో శక్తి యాప్ను డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు 248 చదవని వార్తలు