ఉండ్రాజ్వరం మండలంలో పరీక్షా కేంద్రాల వద్ద పిల్లల తల్లిదండ్రుల నిరీక్షణ
పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల నిరీక్షణ స్థానికులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. సోమవారం ఉదయం పరీక్ష రాసేందుకు తమ పిల్లలను పరీక్షా కేంద్రాల వద్ద దించి, 12.45 కు పూర్తయ్యే పరీక్ష కొరకు మధ్యాహ్నం 12 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. తమ పిల్లలు పరీక్ష ఎలా రాస్తున్నారు, పేపర్ ఎలా ఉంది అనే అనుమానాలతో తల్లిదండ్రులు చర్చించుకుంటున్నారు. తమ బిడ్డల భవిష్యత్ జీవితానికి పునాది వంటిదైన పదవ తరగతి లో మంచి మార్కులు సాధిస్తే, తమ కలలు నెరవేరుతాయని వారు భావిస్తుంటారు.