ఒంగోలు అర్బన్: గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యశాఖ సిబ్బందిని ఆదేశించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
Ongole Urban, Prakasam | Jun 4, 2026
ప్రకాశం జిల్లాలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలములో మహిళా ఆరోగ్య కార్యకర్తలకు మాతాశిశు సంక్షేమ సేవలపై సమీక్షాసమావేశము నిర్వహించడమైనది ఈ సందర్భముగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి మహిళా ఆరోగ్య కార్యకర్త మాతాశిశు సంక్షేమ సేవలపై వారికీ కేటాయించిన లక్ష్యాములను ప్రతి నెల సాదించవలెనని తెలిపినారు ముఖ్యముగా గర్భిణీస్త్రీలను వీలైనంత తొదరగా 12 వారములలోపు గుర్తించి వారిని వెంటనే రిజిస్టర్ చేసి వారికీ అందించవలసిన సేవలన్నిటిని సకాలములో అందించవలసినదిగా ఆదేశించారు