కోడుమూరు: కొత్తూరు వద్ద ట్యాంకర్ ను వెనుక నుంచి ఢీకొన్న లారీ
కోడుమూరు మండలంలోని కొత్తూరు గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం ఓ ట్యాంకర్ ను వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో లారీ ముందు భాగం దెబ్బతింది. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. రెండు వాహనాలు కూడా కర్నూలు వైపు వెళుతున్నాయి.