సత్యసాయికి వినూత్నంగా భక్తుడి జన్మదిన శుభాకాంక్షలు
పుట్టపర్తి సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా హిమాచల్ ప్రదేశ్కు చెందిన యువ కిరత్పాల్ సింగ్ వినూత్నంగా బాబాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. సోమవారం ఆ రాష్ట్రంలోని బీర్ బిల్డింగ్ ప్రాంతంలో పారాషూట్ ద్వారా ఇంకొక వ్యక్తి సహాయంతో ఇద్దరూ కలిసి సత్యసాయి బ్యానర్ పట్టుకొని సత్యసాయి బాబాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో లో వైరల్ కాగా, పలువురు అభినందించారు.