డోన్: డోన్ లో రూ. 26 కోట్ల వ్యయంతో త్రాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Jun 5, 2026 నంద్యాల జిల్లా డోన్లో తాగునీటి సౌకర్యాల మెరుగుదలకు అమృత్ 2.0 పథకం కింద రూ.26.69 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నీటి ట్యాంకులు, పైప్లాన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. పాతపేటలో 7.5 లక్షల లీటర్లు, ఆంజనేయస్వామి కొండపై 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంకులు నిర్మించనున్నారు. ప్రజలకు తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.