సంతనూతలపాడు: మద్దిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ, రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచన
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఆర్ గోపాల కృష్ణ వైద్యులకు సూచించారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ మద్దిపాడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఎన్టిఆర్ వైద్య సేవల కౌంటర్ ను, రోగుల రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ను, క్యాజువాలిటి రూములను, అత్యవసర సేవా విభాగంను, మెడిసన్ స్టోరేజి విభాగాలను ల్యాబ్ తదితర విభాగాలను సందర్శించారు.