అనంతపురం అర్బన్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు సజీవ దహనం
Anantapur Urban, Anantapur | May 3, 2026
అనంతపురం నగర శివారులోని జాతీయ రహదారిపై ఉన్న అరవకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వజ్రకరూరు మండలం పందికుంట కు చెందిన అజిత్ కుమార్ ఆకాష్ అనే ఇద్దరు స్నేహితులు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.