అన్నమయ్య జిల్లా లో వర్షపాతం వివరాలు
సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు జిల్లా లో పడిన వర్షాన్ని డివిజన్ వైద్యాధికారి రామ్మోహన్ నాయక్ వెల్లడించారు. గుర్రంకొండలో 10.4 మి.మీ, కలకడలో 27.4 మి.మీ, పీలేరులో 52.0 మి.మీ వర్షం కురిసింది. అత్యధికంగా కెవి పల్లి మండలంలో 60.4 మి.మీ మదనపల్లె మండలంలో 43.2 మి.మీ, నిమ్మనపల్లెలో 54.2 మి.మీ, కురబలకోటలో 26.0 మి.మీ, తంబళ్లపల్లెలో 4.0 మి.మీ, పీటీఎంలో 2.4 మి.మీ, పెద్దమండెంలో 1.8 మి.మీ, వాల్మీకిపురంలో 47.6 మి.మీ, కలికిరిలో అత్యధికంగా 93.4 మి.మీ, రామసముద్రంలో 24.0 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇతర మండలాల్లో వర్షం పడలేదని తెలిపారు.