మిట్టపల్లి లో వడదెబ్బతో రైతు కూలీ మృతి, గ్రామంలో విషాదం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని మిట్టపల్లి లో విషాదం చోటుచేసుకుంది, గ్రామానికి చెందిన యాతం బాల చెన్నయ్య వడ దెబ్బతో మృతి చెందాడు, గ్రామంలోని మామిడి తోటలో ఆయన కూలీగా పని చేస్తున్నారు, మధ్యాహ్నం ఎండలో ఇంటికి తిరిగి వస్తూ కింద పడిపోయి మృతి చెందాడు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు, ఈ విషయాన్ని మండల అధికారుల దృష్టికి గ్రామ సర్పంచ్ తీసుకుని వెళ్లారు