రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఈరోజు టౌన్ పరిధిలో భారీ కవాతు నిర్వహించారు.పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన కవాతు బట్టు స్ట్రీట్, గాంధీ బజార్, థానా రవి హాల్, బంగ్లా సర్కిల్, బస్టాండ్ ప్రాంతాల వరకు కొనసాగింది.కవాతు సందర్భంగా పట్టణంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, ప్రజల ఫిర్యాదులు, భద్రతా సమస్యలను పరిశీలించిన అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.అనవసరంగా రోడ్లపై వాహనాలు నిలిపి ట్రాఫిక్కు అంతరాయం కలిగించే వాహనదారులకు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.