ఒంగోలు అర్బన్: మావిగన్ అంటూ మాజీ ముఖ్యమంత్రి కామెడీ పీస్ లా మారాడు: ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
Ongole Urban, Prakasam | Apr 5, 2026
మావిగన్ అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కామెడీ పీస్ లా మారాడని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటుందన్నారు రాజధాని కోసం మహిళలు పోరాటం చేశారన్నారు హైకోర్టు కూడా అందుకు మద్దతు తెలిపింది అన్నారు రాజధానికి చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీ పార్లమెంట్ రాజ్యసభలో అన్ని పక్షాలు ఏకగ్రీవ తీర్మానం చేస్తే ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రం సహకరించలేదన్నారు రాజధాని అమరావతిపై జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంత అక్కసో అర్థం కావడం లేదన్నారు కూటమి ప్రభుత్వ పాలనలో అమరావతి అభివృద్ధి చెందుతుందన్నారు