మంగళగిరి: రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం : మంత్రి కొల్లు రవీంద్ర
గుంటూరు జిల్లా మంగళగిరిలో బుధవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజలు ఆదరిస్తున్నారని, రైతులకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, అయితే వైకాపాకు మాత్రం కడుపుమంటగా ఉందని విమర్శించారు. అసత్యాలను ప్రచారం చేయడమే ఆ పార్టీ లక్ష్యమని, కులాలు, మతాల పేరుతో రాజకీయ లబ్ధి కోసం యత్నిస్తోందని ఆరోపించారు.