డోన్ లో మద్యం తాగి వాహనాలు నడిపిన 5 మందికి మూడు రోజుల జైలు శిక్ష
Dhone, Nandyal | May 21, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో మద్యం తాగి వాహనం నడిపిన 5 మందికి మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు గురువారం సీఐ ఇంతియాజ్ భాష తెలిపారు.వారు తెలిపిన వివరాల మేరకు డోన్ పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించగా గోపాల్ బోయ ఈశ్వర్ బోయ మహేష్ తెలుగు గోవిందు బోయ మధు అనే ఐదు మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారని గుర్తించి వారిపై కేసు నమోదు చేసి డోన్ కోర్టులో హాజరుపరచగా వారికి చేర్చి మూడు రోజులుగా జైలు శిక్ష విధించినట్లు పోలీసు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడపవద్దని పోలీసులు హెచ్చరించారు