గుంతకల్లు: గుత్తిలోని అమృత్ సినిమా థియేటర్ వెనుక భాగంలో ఉన్న ఎస్సీ కాలనీలో విద్యుత్ హై వోల్టేజ్ తో దెబ్బతిన్న విద్యుత్తు పరికరాలు
గుత్తి లోని అమృత్ సినిమా థియేటర్ వెనక భాగంలో ఉన్న ఎస్సీ కాలనీలో విద్యుత్ హై వోల్టేజీ కారణంగా విద్యుత్తు పరికరాలు దెబ్బతిన్నాయి. హై వోల్డేజీ తో ఫ్యాన్లు, టీవీలు, ఫ్రిజ్ లు వంటి విద్యుత్ పరికరాలు కాలిపోయాయి. కాలనీలో నివాసం ఉండే మహేష్, పెద్దన్న, లాలు స్వామి, ఓబులేసు తదితర వ్యక్తులకు సంబంధించిన ఇళ్లలోని విద్యుత్ పరికరాలు దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని బాధితులు శనివారం విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేశారు. ఈ ఘటనపై విద్యుత్ శాఖ అధికారులు విచారణ చేపట్టారు.