కర్నూలు: కర్నూలు ఉల్లి మార్కెట్ యార్డ్ పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్టేనని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం 12 గంటలు ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ క్వింటా ఉల్లిని రూ.1,200కు కొనుగోలు చేస్తామంటూ కూటమి ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నారని , కర్నూలు మార్కెట్లో వేలం వేయించినా ఎవ్వరూ కొనడం లేదు. ఉల్లికి ధరే లేకపోతే బిగ్ బాస్కెట్, ఇతరత్రా స్టోర్లలో కిలో రూ.29 32కు, రైతు బజార్లో రూ.25 కు ఎలా అమ్ముతున్నారు ? రైతులకు ఎందుకు ధర రావడం లేదు? ఇది మీ తప్పు కాదా చంద్రబాబూ? అని ప్రశ్నించారు.