ఇచ్ఛాపురం: శనివారం సోంపేటలో సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ట
ఇచ్చాపురం నియోజకవర్గం, సోంపేట పట్టణంలో గత నాలుగు రోజులుగా శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, హోమాలు, మహిళలచే పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు పూజా కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం తొమ్మిది గంటలకు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమ మహోత్సవం జరుగుతుందని శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు నిర్వాహకులు తెలిపారు.