సిర్పూర్ టి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చొరవతో చేతిని, దిందా గ్రామ ప్రజలకు తునికాకు సేకరించిన డబ్బులు అకౌంట్లో జమ
చింతల మానేపల్లి మండలంలోని కేతిని, దింద గ్రామాలు కర్జలి ఫారెస్ట్ రేంజ్ యూనిట్లో ఉన్నాయి. 2004 సంవత్సరంలో సేకరించిన తునికాకు కట్టలకు డబ్బులు విడుదల కాకుండా ఉండటంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దృష్టికి పలువురు గ్రామస్తులు వెంకటేష్ ఆధ్వర్యంలో సమాచారం అందించారు. వారం రోజుల్లోగా తునికాకు డబ్బులు మీ అకౌంట్ లో పడతాయని మాట ఇచ్చిన తర్వాత అధికారులతో మాట్లాడిన వెంటనే వారం రోజుల్లోగా అకౌంట్లో డబ్బులు జమ కావడంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు.