అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా నూతన సంవత్సరం వేల ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఉరవకొండ అర్బన్ సిఐ మహానంది హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన సిఐ ఈనెల 31న రాత్రి నుంచి అన్ని ప్రాంతాల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహింప చేస్తామని మద్యం తాగి పట్టుబడితే కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మైనర్లకు తల్లిదండ్రులు బైకులను ఇవ్వకూడదని గుర్తు చేశారు. నూతన సంవత్సర వేదికలను అందరూ ప్రశాంతంగా ఆనందంగా జరుపుకోవాలని సిఐ పేర్కొన్నారు.