ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో, సర్పంచులు,ఎంపీటీసీలకు ఘనంగా సన్మానం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయంలో పదవి కాలం ముగిసిన సర్పంచులు, ఎంపీటీసీలను అధికారులు మంగళవారం ఘనంగా సత్కరించారు, ఎంపీడీవో నూర్జహాన్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి ఉత్తమ సేవలు అందించారని కొనియాడారు, ప్రస్తుతం మండలంలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నట్లు ఎంపీడీవో నూర్జహాన్ తెలిపారు, మాజీ ఎంపీపీ గర్జన రాఘవేంద్ర రెడ్డి, సర్పంచులు,ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు, మాజీ ప్రజాప్రతినిధులు తమ అనుభవాలను పంచుకున్నారు