అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం లోని పామిడి మండలం దేవరపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం లోని గుంతకల్ మండలం వెంకటం పల్లి గ్రామానికి చెందిన మంజునాథ్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సరోజన ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.