మైదుకూరు పట్టణంలో పలుచోట్ల ప్రధాన రహదారులపై ఏర్పడిన గుంతలను మున్సిపల్ ఏఈ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం మరమ్మతు చేశారు. కడప రోడ్డులో ఉన్న పెద్ద గుంత వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండటంతో అధికారులు వెంటనే స్పందించారు. తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టామని, నిధులు అందిన వెంటనే శాశ్వత పరిష్కారం చేపడతామని ఏఈ నిరంజన్ రెడ్డి తెలిపారు.