ఆత్మకూరు: కోరమేర్ల వద్ద బైక్ ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం, బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, సంగం మండలం, కోరమెర్ల రోడ్డులో ఆర్చి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్ళిపోయింది. బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అటువైపు వెళుతున్న పలువురు వాహనదారులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. దీంతో 108 వాహనంలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఈమెరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.