అనంతపురం నగరంలోని విజయనగర కాలనీలో ముగ్గురు యువకులపై రాళ్లు కట్టెలు రాడ్లతో దాడి
Anantapur Urban, Anantapur | Mar 30, 2026
అనంతపురం నగరంలోని విజయనగర కాలనీ సమీపంలో ముగ్గురు యువకులపై విచక్షణారహితంగా రాళ్లు కట్టలు రాడ్లతో దాడి చేసి గాయపరిచిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వారు మీడియాకు వివరాలను వెల్లడించారు. ఒక్కసారిగా ఇంటిలోకి దూరి విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచినట్లుగా వారు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.