పుంగనూరు: గాలివానకు కూలిన ఇల్లు తప్పిన పెను ప్రమాదం.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ చౌడేపల్లి మండలం పరికిదోన పంచాయతీ మడుకూరు గ్రామానికి చెందిన మునుస్వామి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజులుగా కురుస్తున్న జడివానకు ఓవైపు గోడ ఆదివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కూలిపోయింది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. రెవెన్యూ అధికారులు గాలివానకు కూలిపోయిన ఇంటిని పరిశీలించి నష్టపరిహారం నివేదిక జిల్లా అధికారులకు పంపనున్నారు.