ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలోని క్రీడా మైదానంలో సమ్మర్ కోచింగ్ క్యాంపులు : కోచ్ సుబ్బరాయుడు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని క్రీడా మైదానంలో ఈనెల ఒకటి నుంచి 31 వరకు సమ్మర్ కోచింగ్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు కోచ్ సుబ్బరాయుడు తెలిపారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాకారులను తీర్చిదిద్దే సంకల్పంతో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు శిక్షణ ఇస్తుందని ఆయన వివరించారు, అనుభవజ్ఞులైన సీనియర్ క్రీడాకారులు, కోచ్ల పర్యవేక్షణలో ఈ శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయని కోచ్ సుబ్బరాయుడు పేర్కొన్నారు, ఈ సమ్మర్ క్యాంప్ 31న ముగుస్తుందని ఆయన తెలిపారు