డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ
అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి బుధవారం విజయవాడలోని డీజీపీ కార్యాలయానికి వెళ్లి రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా నూతన ఎస్పీ ధీరజ్ కునుబిల్లిని అభినందిస్తూ, జిల్లా ప్రజల భద్రత కోసం శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే విధంగా సేవలు అందించాలని డీజీపీ సూచించినట్లు సమాచారం.