జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అక్టోబర్ 23వ తేది జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు
జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అక్టోబర్ 23వ తేది, గురువారం అన్నమయ్య జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా అన్నమయ్య జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, జూనియర్ కళాశాలల కు ఎయిడెడ్ యాజమాన్యాల కింద నిర్వహిస్తున్న అన్ని పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు అక్టోబర్ 23వ తేదీన ప్రభుత్వ శెలవు దినముగా ప్రకటిస్తూ