సిర్పూర్ టి: సోమిని గ్రామానికి ప్రారంభమైన ఆర్టీసీ బస్సు. ఆనందం వ్యక్తం చేస్తున్న గ్రామ ప్రజలు
బెజ్జూరు మండలంలోని సోమిని గ్రామానికి రోడ్డు మొత్తం సరిగా లేకపోవడంతో గత కొద్ది రోజులుగా ఆర్టీసీ బస్సు బందు అయింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సహకారంతో రోడ్డు గ్రామస్తులు బాగు చేయడంతో గురువారం ఆర్టీసీ బస్సు పునర్ ప్రారంభం అయింది. గ్రామానికి ఆర్టీసీ బస్సు రావడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ కోనేరు కోనప్పకు ధన్యవాదాలు తెలియజేశారు,