పుంగనూరు: పుంగమ్మ చెరువుకు చేరుతున్న వరద నీరు.హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో పుంగమ్మ చెరువుకు మంగళవారం ఉదయం పదిగంటల నుంచి వరద నీరు చేరుతున్నది. కొన్ని రోజులుగా మండల వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతంలో చెరువులు కుంటలు నిండి వరద నీరు పుంగమ్మ చెరువుకు వచ్చి చేరుతున్నది. పుంగమ్మ చెరువుకు వస్తున్న వరద నీరును చూసి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.