ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన స్థానిక పోలీసులు
Ongole Urban, Prakasam | Apr 3, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్లను పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడమే కాకుండా వారి వివరాలను పోలీసులు సేకరించారు. మత్తు పదార్థాలు మాదకద్రవ్యాలు గంజాయి వంటి తరలింపు వంటి అంశాలను అడ్డుకునేందుకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నిరంతరం తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని పోలీసులు వెల్లడించారు.