పించా ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల.. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి : ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా పించా ప్రాజెక్ట్‌లోకి నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ప్రాజెక్ట్ నుండి 630 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు తెలిపారు.భవిష్యత్తులో ఇంకా నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున, దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మోటార్లు, పశువులు మరియు ఏటిని దాటే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పించా ప్రాజెక్ట్ ఏఈఈ బి.నాగేంద్ర నాయక్ సూచించారు.