ఒంగోలు అర్బన్: ఏడు నియోజకవర్గాలలో 1500 దరఖాస్తులు దాఖలు చేసిన జనసైనికులు : మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య
Ongole Urban, Prakasam | Jul 5, 2026
జనసేన పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా జిల్లాలో పార్టీ పదవుల భర్తీ ప్రక్రియకు కార్యకర్తలు, నాయకుల నుంచి అపూర్వ స్పందన లభించిందనీ మాజీ ఎమ్మెల్యే, జనసేన సమాచార కమిటీ ప్రకాశం జిల్లా పార్లమెంట్ పరిశీలకులు కిలారి రోశయ్య అన్నారు. నగరంలోని గోల్డెన్ వెన్యూ ఫంక్షన్ హాల్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.జూన్ 29 నుండి జూలై 5వ తేదీ వరకు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో పర్యటన చేయడం జరిగిందన్నారు.ఈ పర్యటనలో భాగంగా వివిధ కమిటీల్లో బాధ్యతలు చేపట్టేందుకు జనసేన సైనికుల నుంచి ఏకంగా 1500 దరఖాస్తులు వచ్చాయన్నారు . ప్రతి నియోజకవర్గం నుండి సగటున 200 దరఖాస్తులు రావడం విశేషమన్నారు.