పలమనేరు: ఏనుగులకు ఆహారం అందించిన డిప్యూటీ సీఎం పవన్, ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది, మావటీలకు బహుమానం అందించారు
పలమనేరు: మండలం ముసలమడుగు ఎలిఫెంట్ హబ్ లో కుంకీ ఏనుగులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆహారం అందించే క్రమంలో ఓ ఏనుగు పవన్ ను తొండంతో తోయబోయింది దీంతో అప్రమత్తమైన ఆయన పక్కకు జరిగిపోయారు. అనంతరం యధావిధిగా గజరాజులకు బెల్లం ముద్దలు ఆహారంగా అందించారు. తదుపరి కుంకీలకు మత్తు ఎక్కించే గన్ లను పరిశీలించారు. అనంతరం మావటీలను కలిసి వారి సమస్యలను విన్నారు, కుంకీ ఏనుగులను అహర్నిశలు చూసుకుంటున్నవారికి 50 వేల రూపాయలు బహుమతిగా అందించారు.