అనంతపురం అర్బన్: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆటో చికిత్స పొందుతూ యువకుడు మృతి
Anantapur Urban, Anantapur | Apr 15, 2026
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం లోని గుమ్మగట్ట మండలంలోని జే వెంకటం పల్లి లో ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొన్న ఘటనలో వడ్డే కిరణ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.