నారాయణ్‌ఖేడ్: పట్టణంలో టపాసుల దుకాణాలకు లాటరీ పద్ధతిలో నంబర్ల ను కేటాయించిన మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్
నారాయణఖేడ్ పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయ మైదానంలో దీపావళి సందర్భంగా ఏర్పాటు చేయనున్న టపాసుల దుకాణాలను లాటరీ పద్ధతిలో ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో టపాసుల దుకాణాల నెంబర్లను లాటరీ పద్ధతిలో కేటాయించారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్, శానిటరీ ఇన్స్పెక్టర్, సిబ్బంది పాల్గొన్నారు.