డోన్: బేతంచర్ల మండలానికి చెందిన చైత్ర కు జిల్లాస్థాయి మొదటి ర్యాంక్
Dhone, Nandyal | Jun 1, 2026 బేతంచెర్ల మండలం బుగ్గానిపల్లె ప్రాథమిక పాఠశాల విద్యార్థిని కె. చైత్ర గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్షలో 100 మార్కులకు 97 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు పొందింది. ఈ సందర్భంగా ఎంఈఓ అబ్రహం, ఉపాధ్యాయులు విద్యార్థినిని అభినందించి జ్ఞాపిక బహుకరించారు.ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్య అందుతుందని, చైత్ర విజయం పాఠశాలకు, గ్రామానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు.