ఆత్మకూరు బస్టాండు మరియు ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే బుడ్డా
ఆత్మకూరులో ప్రజల కోసం మరో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి.ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్ మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో సొంత నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్లను ఎమ్మెల్యే బుడ్డా ప్రారంభించారు. ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.ఇక వెలుగోడు హాస్పిటల్‌లో కూడా త్వరలోనే మరో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో అన్ని ఆసుపత్రులు, బస్టాండ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో ఈ తరహా ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.