సమాజ సేవలో యువత ముందు ఉండాలి :నందివర్గం ఎస్సై భూపాలుడు
యువత రక్తదానం చేయడం అలవాటు చేసుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అండగా నిలవాలని నందివర్గం ఎస్సై భూపాలుడు సూచించారు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం పలుకూరు, నందివర్గం గ్రామాల్లో ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి, సేవాభావాన్ని చాటుకున్నారు.