కరీంనగర్: అంగన్వాడి కోడిగుడ్లు వైన్స్ పర్మిట్ రూమ్ షాప్ కు విక్రయించిన ఘటన లో అంగన్వాడీ టీచర్ ను సస్పెండ్ చేసిన అధికారులు
కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో అంగన్వాడికి చెందిన కోడిగుడ్లు వైన్ షాప్ పక్కనే ఉన్న సిట్టింగ్ షాప్ లో అమ్మకానికి పెట్టిన ఘటనలో రంగాపూర్ అంగన్వాడీ 1 టీచర్ రాజమ్మను సస్పెండ్ చేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి మంగళవారం తెలిపారు. ఇటీవల హుజురాబాద్ పర్మిట్ రూంలో మందుబాబులకు స్టఫ్ గా అంగన్వాడి లో పిల్లలకు, గర్భిణీలకు పౌష్టిక ఆహారంగా అందించే కోడిగుడ్లు అమ్మకానికి పెట్టారు. ఈ ఘటనపై విచారణ చేసిన సంక్షేమ అధికారి గుడ్లను విక్రయించినట్లు తేలడంతో చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన సూపర్వైజర్ శిరీష కు వివరణ ఇవ్వాలని శోకజ్ నోటీసులు జారీ జారీ చేశారు.