ఒంగోలు అర్బన్: ఒంగోలులో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం, పాల్గొన్న ప్రజాప్రతినిధులు అధికారులు, యోగాసనాలు వేయించిన గురువులు
Ongole Urban, Prakasam | Jun 21, 2026
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఒంగోలు పట్టణంలో ఆదివారం యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి, పలువురు ప్రజాప్రతినిధులు పోలీసు సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రతిరోజు గంటపాటు యోగా చేయడం వల్ల కలుగు ప్రయోజనాలను వారికి యోగా గురువులు వివరించారు. సంపూర్ణ ఆరోగ్యం పొందేందుకు ప్రతిరోజు యోగా చేయాలని యోగా గురువులు యోగాన్ని బోధించారు.