అనంతపురం జిల్లా వెలుగుప్ప మండలం రవితేజ మండల సమైక్యలు వెలిగిపోయవసాయం మరియు అనుబంధ మహిళ రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం వార్షిక మహాసభను శుక్రవారం వెలుగు ఏపీఎం సురేఖ అధ్యక్షతన మహిళా రైతు సంఘాల లీడర్లతో కలిసి నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో టిడిపి జిల్లా కార్యదర్శి మల్లికార్జున మాజీ ఎంపీపీ తిమ్మప్ప టిడిపి నాయకులు గోవిందు తదితరులు పాల్గొన్నారు. మహిళా రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం ద్వారా ఎరువులు వ్యవసాయ పనిముట్లు మరియు విత్తనాలు తక్కువ ధరలకు అందించడం గిట్టుబాటు ధర కల్పించడం జీవనోపాదుల రుణాలతో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం జరుగుతుందని పేర్కొన్నారు.