శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా అధిక ధరలకు బాణసంచా అమ్ముతున్నారని ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన లీగల్ మెట్రాలజీ అధికారులు
శ్రీ సత్య సాయి జిల్లాలో టపాసుల దుకాణదారులు అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లు వినియోగదారుల నుండి పలు ఫిర్యాదులు అందడంతో, లీగల్ మెట్రాలజీ అధికారులు ఈరోజు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. కస్టమర్ల ఫిర్యాదుల మేరకు ఏ క్షణానైనా దుకాణాలను తనిఖీ చేస్తామని,అధిక ధరలకు అమ్మితే కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టంగా తెలిపారు. వినియోగదారులు ఎవరికైనా అధిక రేట్లు వసూలు చేస్తున్నట్లు గమనించినపుడు, వెంటనే అధికారులకు 79890 05014 నంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.