బనగానపల్లె: అవుకు చెందిన రైతు సుధాకర్ రెడ్డికి "మట్టి మనిషి" పురస్కారం
అవుకు మండలం కాశీపురానికి చెందిన రైతు కష్టానికి ప్రతిఫలం దక్కింది. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అధిక దిగుబడులు రాబట్టడమే కాకుండా, కూలీలతో పాటు స్వయంగా పనులు చేస్తున్న సుధాకర్రెడ్డిని తపన సాహిత్య వేదిక గుర్తించింది. ఆయనను "మట్టి మనిషి" సేవా పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ నెల 21వ తేదీన సత్యసాయి జిల్లా హిందూపురంలో జరిగే కార్యక్రమంలో ఈ పుర