ఎవరైనా రంగురాళ్ల తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు: చింతపల్లి డీఎఫ్వో నరసింగరావు
చింతపల్లి ఫారెస్టు డివిజన్ పరిధిలో ఎవరైనా రంగురాళ్ల తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎఫ్వో నరసింగరావు హెచ్చరించారు. ఆదివారం రాత్రి చింతపల్లి నుంచి మీడియాతో మాట్లాడారు. గుర్రాలగొంది, సిగనాపల్లి, సత్యవరం తదితర ఏడెనిమిది రంగురాళ్లు తవ్వే ప్రదేశాలను గుర్తించి, అక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. గతంలో క్వారీల వద్ద నలుగురు మృతి చెందారని తెలిపారు. రంగురాళ్ల తవ్వకాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవరైనా రంగురాళ్ల తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.